: ట్రక్ డ్రైవర్ కూతురి కోసం వడా పావ్ అమ్మబోతున్న బాలీవుడ్ క్రేజీ స్టార్


బాలీవుడ్ లో విపరీతమైన క్రేజున్న హీరోల్లో రణ్ బీర్ కపూర్ టాప్. అలాంటి కథానాయకుడు ముంబయి వీధుల్లో వడా పావ్ అమ్మాలని నిర్ణయించుకున్నాడు. అందుకు బలమైన కారణమే ఉంది. ముంబయిలో ఓ ట్రక్ డ్రైవర్ కూతురు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతోంది. చికిత్సకు నాలుగు లక్షల రూపాయలు అవసరం కాగా, ఆ పేద డ్రైవర్ వద్ద లక్ష రూపాయాలే ఉన్నాయి. దీంతో, ఓ టీవీ చానల్ ముందుకొచ్చి రణ్ బీర్ కపూర్ ను సంప్రదించి విషయం వివరించింది. అంతేగాకుండా, బాలిక చికిత్సకు అవసరమైన నిధులు సేకరించేందుకు తగిన కాన్సెప్ట్ ను సిద్ధం చేసింది. తొలుత టీవీ షో నిర్వహించాలనుకున్నా, రణ్ బీర్ సూచన మేరకు ఓ కాలేజి వద్ద వడా పావ్ అమ్మేలా కాన్సెప్ట్ మార్చారట. మరి హాట్ హాట్ హీరో రణ్ బీర్ అమ్మితే వడా పావ్ లు కాసుల వర్షం కురిపిస్తాయనడంలో సందేహమే అక్కర్లేదు.

  • Loading...

More Telugu News