: నల్లజాతి దర్శకుడు ఆస్కార్ లో చరిత్ర సృష్టించేనా..?
స్టీవ్ మెక్ క్వీన్.. హాలీవుడ్ లో ఇప్పుడందరి దృష్టి ఈ నల్లజాతి సినీ డైరక్టర్ పైనే ఉంది. '12 ఇయర్స్ ఏ స్లేవ్' సినిమాతో ఆస్కార్ నామినేషన్ పొందిన మెక్ క్వీన్ కచ్చితంగా ఉత్తమ దర్శకుడి కేటగిరీలో ఆస్కార్ అందుకుంటాడని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే ఆస్కార్ చరిత్రలో ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకున్న తొలి నల్లజాతీయుడు మెక్ క్వీనే అవుతాడు. '12 ఇయర్స్..' సినిమా ఇప్పటికే పలు ప్రపంచ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో విమర్శకులను ఒప్పించగలిగింది. కాగా, ఈసారి ఆస్కార్ రేసులో ఉన్న దర్శకులు.. మార్టిన్ స్కోర్సెస్సీ (ది వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్), స్టీవ్ మెక్ క్వీన్ (12 ఇయర్స్ ఏ స్లేవ్), డేవిడ్ ఓ రస్సెల్ (అమెరికన్ హజిల్), ఆల్ఫాన్సో క్యూరాన్ (గ్రావిటీ), అలెగ్జాండర్ పేన్ (నెబ్రాస్కా). ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 2న జరగనుంది.