: వ్యవసాయబడ్జెట్ లో తప్పులు దొర్లాయి మన్నించండి : ప్రభుత్వం
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి వ్యవసాయబడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పుకున్న సర్కారు ఆర్భాటం ఎంతోసేపు నిలువలేదు. వ్యవసాయబడ్జెట్లో కొన్ని పొరపాట్లు జరిగినమాట వాస్తవమేనని ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు లేఖ సైతం రాశారు.
సమన్వయలోపం వల్ల కొన్ని పొరపాట్లు జరిగాయని, అందుకు మన్నించాలని ఆర్థిక మంత్రి కోరారు. బదులుగా ఇవాళ వ్యవసాయ బడ్జెట్ ను వ్యవసాయ కార్యాచరణ గా మారుస్తూ కొత్త పుస్తకాలను ప్రభుత్వం శాసనసభ ముందు ఉంచనుంది. ఇందుకు అనుమతి కోరుతూ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆనం స్పీకర్ కు లేఖ సమర్పించారు.