: సీమాంధ్రకు ప్యాకేజీలు ఇచ్చి.. తెలంగాణను విస్మరించవద్దు: ఈటెల
రాష్ట్రాన్ని విభజిస్తే గొడవ చేస్తారన్న కారణంతో సీమాంధ్ర ప్రాంతానికి ప్యాకేజీలు ప్రకటించి, తెలంగాణను విస్మరించడం తగదని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. కేంద్రం ప్యాకేజీలు ఇవ్వాల్సి వస్తే మహబూబ్ నగర్, ఆదిలాబాద్ వంటి జిల్లాలకు ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భంగపడింది, అన్యాయానికి గురైంది తెలంగాణ ప్రాంతమేనని చెప్పారు. కాగా, తెలంగాణకు మద్దతు విషయంలో బీజేపీ వెనక్కు తగ్గిందని తాము భావించడంలేదని ఈటెల అన్నారు.