: యువతిపై మామ, మరిది అఘాయిత్యం!
భర్త నపుంసకుడు కావడంతో ఆ యువతి (22) జీవితాన్ని బుగ్గిపాలు చేశారా కిరాతకులు. వివరాల్లోకెళితే.. రాజస్థాన్ లోని సమోద్ ప్రాంతంలో ఓ యువతికి ప్రహ్లాద్ అనే వ్యక్తితో 2011లో వివాహం జరిగింది. అయితే, భర్త తరుపు బంధువులు త్వరగా బిడ్డను కనాల్సిందిగా ఒత్తిడి తేసాగారు. తన భర్త సంసారానికి పనికిరాడని ఆమె వారికి బదులిచ్చింది. దీన్ని అలుసుగా తీసుకున్న ఆమె మామ కైలాష్ (50), మరిది మహేష్ (26) తమ నీచ నైజాన్ని ప్రదర్శించారు. ఆమెపై తరచూ అత్యాచారానికి పాల్పడుతూ ఆమెను గర్భవతిని చేశారు. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్ళి బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.