: దిగ్విజయ్ సింగ్ కు సిగ్గులేదు: కిషన్ రెడ్డి
తెలంగాణ బిల్లు విషయంలో బీజీపీపై తప్పుడు విమర్శలు చేయడం భావ్యం కాదని... తెలంగాణపై బీజేపీ వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. టీడీపీతో పొత్తుపై బీజేపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో అధిష్ఠానాన్ని సైతం ధిక్కరిస్తున్న సీఎం కిరణ్ ను వెనకేసుకొస్తున్న దిగ్విజయ్ సింగ్ కు సిగ్గు లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.