: 'నేను చీటర్ ను కాదు' అంటున్న టాలీవుడ్ యువ హీరో


యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తెలుసుకదా.. 'హ్యాపీడేస్'తో టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చలాకీ కుర్రాడు ఓ మోసగాడని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అతడిని అరెస్టు చేశారన్న వార్తలు కూడా వచ్చాయి. దీనిపై ఈ యువ హీరోనే స్వయంగా వివరణ ఇచ్చేందుకు ట్విట్టర్లో స్పందించాడు. చీటింగ్ కేసులో అరెస్టయిన నిఖిల్ తాను కాదని.. తన పేరు నిఖిల్ సిద్ధార్థ్ అని.. అరెస్టయింది మరో యాక్టర్ నిఖిల్ రెడ్డి అని స్పష్టం చేశాడు. దయచేసి అభిమానులు అయోమయానికి గురికాకుండా, సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టింగ్స్ పెట్టేముందు ఓసారి నిర్ధారణ చేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఫ్యాన్స్ ను కోరాడు.

  • Loading...

More Telugu News