: మునిగిపోయే నావ కాంగ్రెస్ : సుజనా చౌదరి
టీబిల్లును దొడ్డిదారిలో పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పన్నినా అడ్డుకుని తీరుతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావలాంటిదని ఎద్దేవా చేశారు. బీజేపీతో పొత్తు గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.