: వరంగల్ లో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు సభ్యులున్న దొంగల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 472 గ్రాముల బంగారం, 640 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ అర్బన్ ఎస్పీ చెప్పారు. నిందితులు 24 చోరీలకు పాల్పడ్డారని, వారు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారని ఆయన పేర్కొన్నారు. చోరీ సొత్తును అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం రావడంతో వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.