: స్నేహితుడిని కట్టేసి అమ్మాయిపై అత్యాచారం చేశారు


మధ్యప్రదేశ్ లో జరిగిందీ ఘోరం. ఓ టీనేజ్ అమ్మాయి భోపాల్ నుంచి మహాదేవ్ పాణి ప్రాంతానికి తన స్నేహితుడితో కలిసి వచ్చింది. అక్కడ నలుగురు యువకులు వారిని అడ్డగించారు. స్నేహితుడిని చెట్టుకు కట్టేసి అమ్మాయిపై వంతులవారీగా అత్యాచారం చేశారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో, ఆ బాధితురాలు స్నేహితుడి కట్లు విప్పింది. తర్వాత వారు భోపాల్ వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News