: వస్త్రాలపై వ్యాట్ ఎత్తివేయాలని టీడీపీ ధర్నా
వస్త్రాలపై వ్యాట్ విధించడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది. ఈ ఉదయం గన్ పార్క్ వద్ద ఆ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. విదేశీ మద్యంపై పన్ను తగ్గించిన ప్రభుత్వం వస్త్రాలపై ఎందుకు తగ్గించదని ప్రశ్నించారు. వ్యాట్ ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకూ వ్యాపారులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ధర్నా అనంతరం తెలుగుదేశం ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిపోయారు.