: యూపీఏకు రాష్ట్రపతి సమాధానం చెబుతారు: లగడపాటి
రాష్ట్రపతిని రబ్బర్ స్టాంప్ లా భావించిన యూపీఏ ప్రభుత్వానికి ప్రణబ్ సమాధానం చెబుతారాని భావిస్తున్నామని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఈ క్రమంలో శాసనసభ తిరస్కరించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించరని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజనకు నిరసనగా సుప్రీంకోర్టు, హైకోర్టులో తమ పిటిషన్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఒకవేళ ఆందోళన చేసే సభ్యులను సస్పెండ్ చేసినా, అవిశ్వాస తీర్మానం మాత్రం చేపట్టాలని లగడపాటి అన్నారు. అవిశ్వాసం చేపడితే కనుక అనేక మంది సభ్యులు ప్రభుత్వాన్ని చెడామడా దులిపేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అయినా, మేజిక్ ఫిగర్ అయిన 272 మంది సభ్యుల మద్దతు యూపీఎకు లేదని లగడపాటి అన్నారు.