: నువ్వెవడివిరా మాట్లాడేదానికి..?: ఏపీభవన్ వద్ద రేణుకా చౌదరి ఘీంకారం
ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద రేణుకా చౌదరి తొడగొట్టారు. నువ్వెవడివిరా మాట్లాడేదానికి? అంటూ హూంకరించారు. వివరాల్లోకి వెళ్తే... పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపరాదంటూ... తెలంగాణ విధ్యార్థులు ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ధర్నా చేపట్టారు. వీరికి సంఘీభావం తెలపడానికి వెళ్లిన రేణుకను... అక్కడున్న తెలంగాణ ఉద్యోగులు 'రేణుకా గో బ్యాక్' అంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడున్న వారు... రేణుక వర్గం, వ్యతిరేక వర్గంగా విడిపోయారు. అసలే ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన రేణుక... ఇక ఆగలేకపోయారు. ఎదురు ప్రశ్నిస్తున్న ఓ ఉద్యోగిని... నువ్వెవడివిరా మాట్లాడేదానికి... దమ్ముంటే ఇక్కడకు రారా.. అంటూ సవాల్ విసిరారు.