: కూతురి వివాహంలో చిందేసిన బాలీవుడ్ నటి.. కన్నీరు పెట్టిన భర్త
ఉత్తర భారతదేశంలో పెళ్ళంటే సంగీత్ తప్పనిసరి. వధూవరుల బంధుమిత్రులు, ఆహ్వానితులు అందరూ కలిసి ధూమ్ ధామ్ గా డ్యాన్స్ చేయడం కామన్ అయిపోయింది. ఇక బాలీవుడ్ వర్గాల్లో అయితే చెప్పేదేముంది. తారలందరూ ఒక్కచోటే కొలువుదీరి తళుక్కుమనిపిస్తారు. తాజాగా, అలనాటి డ్రీమ్ గాళ్ హేమమాలిని చిన్నకూతురు అహానా, వ్యాపారవేత్త వైభవ్ వోరా పెళ్ళికి హిందీ చిత్రపరిశ్రమ యావత్తూ తరలివచ్చింది. ఢిల్లీలో జరిగిన ఈ పెళ్ళి వేడుకల్లో సంగీత్ నిర్వహించగా.. హేమమాలిని కూడా పూర్వవైభవాన్ని గుర్తు చేస్తూ ఉత్సాహంగా డ్యాన్సులేసింది. ఓవైపు ఈషా డియోల్ చప్పట్లతో ఉత్సాహపరుస్తుండగా.. ఈ వయసులోనూ హేమ చేసిన డ్యాన్సులు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి.
మరోవైపు, అహానా తండ్రి ధర్మేంద్ర కుమార్తె వివాహ వేడుకల్లో కన్నీరొలికించాడు. కన్యాదానం చేసిన పిమ్మట మాట్లాడుతూ, 'దానాలన్నింటికంటే కన్యాదానం మిన్న, అందుకే, మేం చేసిన దానానికి ప్రతిగా భగవంతుడు మాకు ఏదో ఇవ్వకపోడు' అని వ్యాఖ్యానించాడు.