: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. మొదటి అంతస్తుపై నుంచి దూకిన ముంబై మోడల్
హైదరాబాద్ పంజాగుట్ట ప్రాంతంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో... ఆ ఇంటిపై గత అర్ధరాత్రి పోలీసులు దాడిచేశారు. ఈ సందర్భంలో, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ యువతి మొదటి అంతస్తుపై నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడటంతో, పోలీసులు ఆమెను చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువతి ఓ ముంబై మోడల్ అని పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో, వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ నిర్వాహకుడితో పాటు మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.