: వ్యవసాయశాఖలో ఐటీ సేవలను ప్రారంభించిన కన్నా లక్ష్మీనారాయణ
వ్యవసాయశాఖలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సేవలను ఇవాళ ఉదయం మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. వ్యవసాయశాఖలో 34 రకాల ఐటీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయశాఖలో భూసార పరీక్షలు, లైసెన్స్ మేనేజ్ మెంట్ సిస్టమ్, వ్యవసాయ యంత్రీకరణ, ఈ-అగ్రి ల్యాబ్స్, ఎంప్లాయ్ మెంట్ గ్రీవెన్స్ మానిటరింగ్, శిక్షణ విభాగాల్లో ఐటీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఐటీ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.