: పోలీసుల కాల్పులతో దద్దరిల్లిన ఖమ్మం ఆసుపత్రి


ఈ ఉదయం ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రి పోలీసు తుపాకుల మోతలతో దద్దరిల్లింది. వివరాల్లోకి వెళ్తే... ఓ రిమాండ్ ఖైదీని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకొచ్చారు. సందు చూసుకుని జంప్ అయ్యేందుకు ఖైదీ ప్రయత్నించాడు. దీంతో, పోలీసులు తమ తుపాకులకు పని కల్పించారు. తుపాకీ కాల్పులతో రోగులు, వారి బంధువులు, వైద్య సిబ్బంది ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. చివరకు, పారిపోతున్న ఖైదీని పోలీసులు పట్టుకున్నారు. కాల్పుల్లో ఖైదీ స్వల్పంగా గాయపడ్డాడు.

  • Loading...

More Telugu News