: కావాల్సింది 320 పరుగులు.. చేతిలో 9 వికెట్లు
ఆక్లాండ్ లో భారత్, న్యూజీలాండ్ ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. 407 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 13 పరుగులు చేసిన మురళీ విజయ్ జట్టు స్కోరు 36 దగ్గర సౌతీ బౌలింగ్ లో వాట్లింగ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం ధావన్ కు పుజారా జతకలిశాడు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. ధావన్ 49, పుజారా 22 క్రీజులో ఉన్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. భారత్ గెలవాలంటే మరో 320 పరుగులు చేయాలి. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి.