: కోడికూత 'కొక్కొరోకో' మిస్టరీ వీడింది!


ఇప్పటికీ మన పల్లెటూళ్లలో 'కొక్కొరోకో' అంటూ కోడి కూత వినిపించిందంటే  ... ఇక తెల్లారినట్టుగానే భావించి, నిద్ర లేచి ఎవరి పనులు వాళ్లు చేసుకుంటారు. పొద్దు పొడుపును గుర్తించి ... మానవుడి దైనందిన జీవితానికి ఇలా తానే ఒక గడియారంగా కోడిపుంజు అనాదిగా సేవలు అందిస్తూ వస్తోంది. అయితే, ఈ కోడి పుంజుకి తెలవారుతోందన్న విషయం ఎలా తెలుస్తోందన్నది శాస్త్రవేత్తలకు ఎప్పటి నుంచో పెద్ద మిస్టరీగా వుంది.

ఉదయభానుడి తొలి వెలుగులు ... వేకువ సవ్వడులను బట్టి కోడిపుంజు ఇలా కొక్కొరోకో అంటూ మనల్ని మేలుకొలుపుతోందంటూ ఇన్నాళ్ళూ శాస్త్రవేత్తలు నమ్ముతూ వచ్చారు. అయితే, తాజా పరిశోధనలను బట్టి, తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. కోడిపుంజు లో వున్న జీవగడియారం (బయోలాజికల్ క్లాక్) కారణంగానే కోడి వేకువను పసిగడుతోందని తేల్చారు. దాని జన్యు నిర్మాణంలోనే ఈ జీవ గడియారం నిక్షిప్తమై వుందట!              

  • Loading...

More Telugu News