: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
రాష్ట్రంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 450 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మూడు లారీల్లో బియ్యాన్ని తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మూడు లారీలను, తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.