: ఒకే రోజు మూడు రాష్ట్రాల్లో మోడీ సభలు.. నేటి సాయంత్రం చెన్నైలో


ఎన్నికలకు వ్యవధి తక్కువగా ఉండడంతో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ తన ప్రచారాన్ని స్పీడెక్కించారు. నేడు ఒక్క రోజే మూడు రాష్ట్రాల్లో బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటున్నారు. ఉదయం 11 గంటలకు మణిపూర్ లోని ఇంఫాల్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అసోంలోని గువహటిలో వెటర్నరీ గ్రౌండ్ లో మధ్యాహ్నం 1కి మోడీ మహా జాగరణ్ ర్యాలీ ఉంటుంది. అనంతరం మోడీ భోజనం పూర్తి చేసుకుని చెన్నైకు వెళతారు.

చెన్నైలో సాయంత్రం 7 గంటలకు మోడీ సభ జరుగుతుంది. ఇందులో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత మోడీ తమిళనాడులో పాల్గొంటున్న తొలి బహిరంగ సభ ఇదే.

  • Loading...

More Telugu News