: మోడీ కోటలో నేడు రాహుల్ పాదయాత్ర


లోక్ సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ప్రధాన మంత్రి అభ్యర్థులైన మోడీ, రాహుల్ తమ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. మోడీ కోట గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ బలాన్ని ఇనుమడింప జేయాలన్న వ్యూహంలో భాగంగా రాహుల్ ఈ రోజు దక్షిణ గుజరాత్ లోని బర్దోలిలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించనున్నారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. మోడీ గడ్డపై నుంచి ఆయనపైనే రాహుల్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టనున్నారు. గుజరాత్ లో 2002 నాటి అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ వాటిని ఇంకా ఎగదోశారంటూ రాహుల్ గతంలో తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News