: నేటికి 2400 కిమీ పూర్తి.. ఇది బాబు పాదయాత్ర ట్రాక్ రికార్డు


కాంగ్రెస్ పాలనలో పడుతున్న కష్టాల నుంచి  ప్రజలను బయటపడేసేందుకే తాను పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రస్తుతం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో 'వస్తున్నా.. మీకోసం' పేరిట పాదయాత్ర చేస్తున్నారు. కాగా, బాబు పాదయాత్రలో మరో మైలురాయి చేరుకున్నారు.

ఇప్పటివరకు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 2400 కిమీ మేర నడక సాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కోసం రాష్ట్రాన్నే దోచిపెట్టాడని బాబు ఆరోపించారు. బాబు ఏప్రిల్ 19న పాదయాత్రను విశాఖలో ముగించనున్నారు. అప్పటికి ఆయన పాదయాత్ర ఆరంభించి సరిగ్గా 200 రోజులు పూర్తవుతాయి. 

  • Loading...

More Telugu News