: న్యూజిలాండ్ 105 ఆలౌట్
ఆక్లాండ్ లో ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో, న్యూజిలాండ్ 105 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు షమీ 3, జహీర్ 2, ఇషాంత్ 2 వికెట్లు తీశారు. మొదటి ఇన్నింగ్స్ లో కివీస్ 503 పరుగులు, ఇండియా 202 పరుగులు చేశాయి. దీంతో, టీంఇండియా ముందు 407 పరుగుల భారీ విజయలక్ష్యం ఉంది.