: ముగిసిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
ప్రధాని మన్మోహన్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ భేటీకి ప్రధాని, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ నెల 12వ తేదీన రాజ్యసభలో టీ-బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణ ముసాయిదా బిల్లుకు భారతీయ జనతా పార్టీ సహా మిగతా పార్టీల మద్దతు కూడగట్టాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సుమారు గంట సేపు కోర్ కమిటీ సమావేశం జరిగింది.