: ఎంపీ హర్షకుమార్ పై నాన్ బెయిలబుల్ వారెంట్
అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో న్యాయస్థానం ఎదుట హాజరుకాకపోవడంతో, విశాఖ నాల్గవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
2004లో ఓ సన్మాన కార్యక్రమంలో హర్షకుమార్.. కృష్ణ స్వరూప్ అనే వ్యక్తిపై దాడి చేసినట్టు ఆరోపణలున్నాయి. అప్పట్లో ఈ ఘటనపై కేసు నమోదైంది. అయితే, హర్షకుమార్ కోర్టు విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా, ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.