: అమితాబ్ బోరున విలపించిన వేళ..
బాలీవుడ్ నట దిగ్గజం బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ సందర్భంలో తన తండ్రి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారట. ఈ విషయాన్ని అమితాబ్ సతీమణి, ఎంపీ జయా బచ్చన్ ఓ పుస్తకంలో పేర్కొన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా కుదిపేసిన బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణంలో అమితాబ్ కూ పాత్ర ఉన్నట్టు పత్రికలు పతాక శీర్షికలతో ప్రచురించాయి. దీంతో, ఆయన కుటుంబం తీవ్ర ఆవేదనకు లోనైంది. ఓ రోజు అమితాబ్ తండ్రి, కవి, దివంగత హరివంశ్ రాయ్ బచ్చన్ ఈ విషయమై కుమారుడిని ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారట. అమితాబ్ ను పిలిచి 'పత్రికల్లో వస్తున్నట్టుగా బోఫోర్స్ కుంభకోణంలో నీ పాత్రేమైనా ఉందా?' అని అడగ్గా.. అందుకు బదులుగా బిగ్ బి బోరున విలపించాడని జయ తన పుస్తకంలో పేర్కొన్నారు. 1984లో అమితాబ్ అలాహాబాద్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఘనవిజయం సొంతం చేసుకున్నాడు. అనంతరం 1986లో ఈ బోఫోర్స్ కుంభకోణం వెలుగుచూసింది. స్వీడన్ కు చెందిన హోవిట్జర్ శతఘ్నులను కొనుగోలు చేసే క్రమంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి భారీగా ముడుపులు అందాయని ప్రతిపక్షాలు ఎలుగెత్తాయి.