: కేంద్ర కేబినెట్ భేటీ.. తరువాత కాంగ్రెస కోర్ కమిటీ భేటీ
కేంద్ర కేబినెట్ భేటీ ప్రధాని నివాసంలో ప్రారంభమైంది. ఈ భేటీలో తెలంగాణ బిల్లును కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకు రానున్నారు. కీలకమైన తెలంగాణ బిల్లును ఆమోదించి, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలను ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. కేంద్ర కేబినెట్ భేటీ తరువాత కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ జరగనుంది. ఈ భేటీలో తెలంగాణ బిల్లును సీమాంధ్ర నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో పార్లమెంటులో వారిపై ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చు అనే అంశాన్ని చర్చించే అవకాశం ఉందని సమాచారం.