: థర్డ్ ఫ్రంట్ ఓ అసంబద్ధ ఆలోచన: లాలూ
దేశంలో కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు పలు ప్రాంతీయ పార్టీల నేతలు ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ జేడీ (యూ) కూడా థర్డ్ ఫ్రంట్ లో కలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న నితీశ్ పలువురు నేతలతో మంతనాలు చేస్తున్నారు. కానీ, దీనిపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శలు గుప్పిస్తున్నారు. థర్డ్ ఫ్రంట్ అంటే... మునిగిపోతున్న పడవను పైకి తీసుకొచ్చేందుకు నితీష్ చేస్తున్న ఓ అసంబద్ధ ఆలోచన అని అన్నారు. అలా చేయాలని ఎవరూ కోరుకోరని పేర్కొన్నారు. కాగా, తప్పుదారి పట్టిస్తున్న నితీష్ ప్రభుత్వాన్ని బీహార్ ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు.