: పార్లమెంటులో తెలంగాణ రభసకు కేంద్రమే కారణం: మాయావతి


పార్లమెంటులో తెలంగాణ రభసకు కేంద్ర ప్రభుత్వమే కారణమని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, పార్లమెంటులో తెలంగాణ కావాలని కొందరు, వద్దని మరి కొందరు సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తుండడంతో సభ సజావుగా నడవట్లేదని మండిపడ్డారు. పార్లమెంటులో తెలంగాణ అంశం కారణంగా ఇతర బిల్లులేవీ చర్చకు రావడం లేదని అన్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ పాటికే తెలంగాణ బిల్లుతో సహా ఇతర కీలకమైన బిల్లులన్నీ ఆమోదం పొందేవని ఆమె అభిప్రాయపడ్డారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం కనుక, తాము తెలంగాణకే మద్దతు తెలుపుతున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News