: టూరిస్టులకు భద్రత కల్పించరూ.. : షిండేకు 'చిరు' విన్నపం


దేశంలో రోజురోజుకూ అధికమవుతున్నఅత్యాచారాలు ఇప్పుడు విదేశీ యాత్రికులపైనా జరుగుతున్నాయి. నిన్న మధ్యప్రదేశ్ లో ఓ స్విస్ మహిళపై అత్యంత హేయంగా పదిమందికి పైగా అత్యాచారానికి పాల్పడగా, నేడు ఆగ్రాలో ఓ బ్రిటన్ మహిళ లైంగిక దాడికి గురైంది. ఈ సంఘటనల పట్ల కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి స్పందించారు.

దేశంలో టూరిస్టులకు రక్షణ కల్పించాలంటూ ఆయన కేంద్ర హోం మంత్రి షిండేకు విజ్ఞప్తి చేశారు. అత్యాచారయత్నానికి గురైన బ్రిటన్ మహిళ హోటల్ గది కిటికీలోంచి కిందికి దూకడంతో కాళ్ళకు దెబ్బలు తగిలిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిరంజీవి.. షిండేకు వివరించారు. ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News