: అమ్మాయిలను పడుపు వృత్తిలో దింపుతున్న విదేశీ మహిళకు అరదండాలు
ఆఫ్రికా నుంచి వివిధ కారణాల నిమిత్తం భారత్ వచ్చిన ఉగాండా అమ్మాయిలను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ఇరీనే మహిళను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమె కూడా ఉగాండా దేశానికే చెందినది కావడం గమనార్హం. ఈమెపై మహిళల అక్రమ రవాణా కేసుతోపాటు బలవంతంగా పాస్ పోర్టులు లాగేసుకుందున్న ఆరోపణలపైనా కేసు నమోదు చేశారు. కాగా, ఇరీనేకి సహకరించినట్టుగా భావిస్తున్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇరీనే బారిన పడిన ఉగాండా అమ్మాయిలను రక్షిత గృహానికి తరలించారు. అంతకుముందు వారు ఢిల్లీ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సోమ్ నాథ్ భారతిని కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. దీంతో, మంత్రి చర్యలకు ఆదేశించారు.