: ముగిసిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్


రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం తొమ్మది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ముగ్గురు, టీడీపీ నుంచి ఇద్దరు, టీఆర్ఎస్ నుంచి ఒకరు పోటీ చేశారు. రాష్ట్రంలోని పార్టీల నుంచి మొత్తం 248 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో తొలి ఓటును స్పీకర్ నాదెండ్ల మనోహర్ వేయగా, చివరిగా ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి ఓటు వేశారు. కాగా, సీపీఎం(1), బీజేపీ(4), వైఎస్సార్సీపీ(23) మంది ఓటింగ్ కు హాజరుకాలేదు. ఓటింగ్ లో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిరస్కరణ ఓటు ఉపయోగించుకున్నారు. కాగా, మంగళగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కమల ఖాళీ బ్యాలెట్ పేపర్ ను బాక్సులో వేశారు.

  • Loading...

More Telugu News