: ఎమ్మెల్యేలను మాయం చేశారు


తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను తృణమూల్ కాంగ్రెస్ నేతలు మాయం చేశారని పశ్చిమ బెంగాల్ సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలు సుమిత్ మోండాల్, అనంతదేబ్ అధికారి, దశరథ్ టిర్కేలు ఉదయం నుంచి కనిపించడంలేదని, ఐదు రాజ్యసభ సీట్లకు ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ నేతలు వారిని ప్రలోభాలకు గురి చేసి ఉంటారని సీపీఎం సీనియర్ నేత రాబిన్ దేబ్ అన్నారు. తృణమూల్ పార్టీ ఎన్నికల సందర్భంగా నియమావళిని తుంగలో తొక్కి, ఇష్టారాజ్యంగా నడుచుకుంటోందని మండిపడ్డారు. డబ్బు ఆశ చూపడం, పదవులను ఎరవేయడం వంటి నీతిబాహ్యమైన పనులతో ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని చెప్పారు. ఇందుకు పోలీసులను వినియోగించుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. కాగా, సీపీఎం పార్టీ జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరికి విషయం వివరించి, పక్కదారి పట్టిన ఎమ్మెల్యేలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరామని దేబ్ తెలిపారు.

  • Loading...

More Telugu News