: మోడీ ముందు రాహుల్ బచ్చా: బాబా రాందేవ్


గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రధాని కావాలని ఆంకాంక్షిస్తున్న వ్యక్తుల్లో యోగా గురు బాబా రాందేవ్ ముందుంటారు. మోడీ కోసం ఆయన ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలో, ముంబైలోని వర్లీ జంబోరి మైదానంలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాబా రాందేవ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టారు. దేశవ్యాప్తంగా ప్రజాభిమానం చూరగొన్న నరేంద్ర మోడీ ముందు... రాహుల్ గాంధీ ఓ చిన్న పిల్లవాడని ఎద్దేవా చేశారు. రాహుల్ ప్రధాని కావాలని దేశంలో కనీసం 15 శాతం మంది కూడా కోరుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. మోడీ అధికారంలోకి వస్తేనే... పేద వారికి మంచి జరుగుతుందని, దేశం అభివృద్ధి బాట పడుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News