: మహిళా ప్రయాణికుల భద్రత కోసం రైల్వే హెల్ప్ లైన్ నెంబర్
రైళ్లలో ప్రయాణించే సమయంలో మహిళలపై జరుగుతున్న వేధింపుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ హెల్ప్ లైన్ నెంబరు ఏర్పాటు చేయనుంది. హెల్ప్ లైన్ 1322 నెంబరు ఏర్పాటుకు నాలుగు కోట్ల 70 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని రైల్వే స్థాయీ సంఘం అంచనా వేసింది. ప్రొఫెషనల్ కాల్ సెంటర్ ద్వారా హెల్ప్ లైన్ ను నిర్వహిస్తారు. ఒక డీఐజీ, నలుగురు ఇన్ స్పెక్టర్లు దీన్ని పర్యవేక్షిస్తారు.