: రోజంతా నవ్వే 'గులాబీ'కి పాతికవేలు!


అందమైన అతివలను అరవిచ్చిన గులాబీలతో పోల్చడం తప్పేమీకాదు. రాజుల కాలం నుంచి కవులు అందమైన స్త్రీలను పూవుల పేరిట వర్ణించడం మనకు కొత్తేమీకాదు. సరిగ్గా, దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్ పో-2014లోనూ మనోహరమైన 'రోజా పువ్వులు' దర్శనమిచ్చాయి. ప్రదర్శనకు పెట్టిన ప్రతి కారు, ప్రతి బైక్ వద్ద ఓ గులాబీలాంటి అమ్మాయి.. ముఖంపై చెరగని చిరునవ్వుతో వీక్షకులను, పారిశ్రామిక వర్గాలను ఆకట్టుకున్నారు. వాహనం రంగులకు నప్పే డిజైనర్ దుస్తులు ధరించిన ఈ మోడల్స్ పనల్లా రోజంతా నవ్వుతూ ప్రసన్నంగా కన్పించడమే. కొత్త మోడళ్ళను పరిశీలించేందుకు వచ్చే అతిథులకు వివరాలు అందించడమూ వారి విధే. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారినే ఈ చిరునవ్వులు రువ్వే కార్యక్రమానికి ఎంచుకుంటారట ఆయా కంపెనీల బ్రాండ్ మేనేజర్లు. 8 నుంచి 10 గంటల పాటు వారు అలా నిల్చుంటే వారికి రూ.10 వేల నుంచి పాతిక వేల వరకు లభిస్తాయి. కాలేజి అమ్మాయిలు, ఔత్సాహిక మోడళ్ళను ఇందుకు వినియోగిస్తామని ఓ కంపెనీకి చెందిన సీఈవో తెలిపారు.

  • Loading...

More Telugu News