: మా వాదనలో బలం ఉందని సుప్రీం నమ్ముతోంది: పయ్యావుల
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా తాము వినిపించిన వాదనల్లో బలం ఉందని సుప్రీంకోర్టు నమ్ముతోందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. దాదాపు, గంటన్నర పాటు చేసిన వాదనలను కోర్టు సావధానంగా ఆలకించిందని చెప్పారు. అయితే, సరైన సమయంలో మరోసారి సుప్రీంకు వెళతామని పయ్యావుల చెప్పారు.