: ఓటు వేసిన మోత్కుపల్లి
రాజ్యసభ ఎన్నికల్లో టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో కీలక నేతగా ఎదిగిన మోత్కుపల్లి రాజ్యసభ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే చివరి క్షణంలో చంద్రబాబు ఆ సీట్లను ఇతరులకు కేటాయించారు. దీంతో మానసిక వేదనకు గురైన మోత్కుపల్లి పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయరనే వదంతులు కూడా వెల్లువెత్తాయి. అయితే వాటన్నింటికీ తెరదించుతూ, మోత్కుపల్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.