: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శాంతినగర్ వద్ద ఈ సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గాయపడగా, వారిని నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. కాగా, బస్సును తప్పించే ప్రయత్నంలో ఆటో.. ట్రాక్టర్ ను ఢీకొన్నట్టు సమాచారం.