: మహిళా నగ్నంగా కనిపిస్తే అసభ్యకరం కాదు: సుప్రీం


మహిళల నగ్న చిత్రాల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఒక మహిళ నగ్న చిత్రాన్ని ప్రచురణకు వినియోగిస్తే.. అది అసభ్యకరం కిందకు రాదని స్పష్టం చేసింది. 'మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించడాన్ని నిషేధించే 1986 చట్టం కింద కోర్టు ఈ తీర్పు చెప్పింది. ఒక మహిళ నగ్న చిత్రం లేదా అర్ధనగ్న చిత్రం.. లైంగిక ఉత్తేజం, కోర్కెలను కలగజేస్తే తప్ప దానిని అసభ్యకరమని అనడానికి లేదు' అని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ ఏకే సిక్రిలతో కూడిన బెంచ్ పేర్కొంది.

ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ బోరిస్ బెకర్ నగ్న చిత్రాన్ని ప్రచురించిన రెండు ప్రచురణ సంస్థలపై విచారణను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఏదైనా కథనం లేదా పుస్తకం అసభ్యకరంగా ఉందని నిర్ధారించే విషయంలో కోర్టు కొందరి అబిప్రాయాలను కాకుండా జాతి ప్రమాణాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని సూచించింది. అసభ్యకరమనేది చిత్ర భంగిమలపై ఆధారపడి ఉంటుందని, లైంగిక ఉత్తేజాన్ని కలిగించే వాటినే అశ్లీలంగా భావించాల్సి ఉంటుదని ధర్మాసనం పేర్కొంది. అసభ్యత అనేది సాధారణ పౌరుడు ఆలోచనల్లోంచి చూడాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News