: బెంగళూరులో మొదలైన ’ఎయిరో ఇండియా-2013‘


బెంగళూరు శివారులోని యలహంక ఎయిర్ బేస్ లో ’ఎయిరో ఇండియా-2013‘ విమానాల ప్రదర్శనను కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎ.కె.ఆంటోనీ ఈ ఉదయం ప్రారంభించారు. ఈ ప్రదర్శన ఈ నెల 10వ తేదీ వరకు జరుగుతుంది. ఇందులో పలు దేశ, విదేశాల యుద్ధ, పౌర విమానాల రాకలు, వాటి విన్యాసాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ప్రదర్శనలో మొత్తం 53 పౌర, సైనిక విమానాలు పాల్గొంటున్నాయి. భారత్ తో పాటు వివిధ దేశాలకు చెందిన యుద్ధ విమానాల ప్రత్యేక విన్యాసాలు ప్రదర్శనలో ఆకట్టుకొని అలరించనున్నాయి.

  • Loading...

More Telugu News