: ఫేస్ బుక్ అరుదైన నిర్ణయం.. ఓ తండ్రికి సంతోషం!
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ఓ అరుదైన నిర్ణయం తీసుకుంది. చనిపోయిన తన కుమారుడికి చెందిన ఫేస్ బుక్ పేజిని యాక్సెస్ చేసేందుకు అనుమతించాలని కోరిన ఓ తండ్రి విన్నపాన్ని ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ అంగీకరించారు. సెయింట్ లూయిస్ కు చెందిన జాన్ బెర్లిన్ అనే వ్యక్తి కుమారుడు జెస్సీ 2012లో సహజ మరణం పొందాడు. కొద్దిరోజుల క్రితమే ఫేస్ బుక్ పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ 'లుక్ బ్యాక్' జెస్సీ తండ్రి దృష్టికి వచ్చింది. దీంతో, ఆయన తన కుమారుడి ఫేస్ బుక్ హిస్టరీని వీడియో తలపోస్తూ మార్క్ జుకెర్ బర్గ్ ను ఉద్దేశించి ఓ వీడియో విన్నపాన్ని యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. ఈ పోస్టింగ్ కు రెండ్రోజుల్లోనే పది లక్షల హిట్లు రావడం విశేషం. ఈ నేపథ్యంలో మార్గ్ జుకర్ బర్గ్ ఆ తండ్రి విన్నపాన్ని మన్నించాడు. ఆయన కుమారుడు జెస్సీ ఫేస్ బుక్ పేజీని తెరిచేందుకు అవసరమైన యాక్సెస్ ను మంజూరు చేశారు.