: బజారులో వస్తువుల కంటే హీనంగా కొనేవారు: చంద్రబాబు


ఎమ్మెల్యేలను బజారులో వస్తువుల కంటే హీనంగా కాంగ్రెస్ పార్టీ కొనేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ పార్టీల బలాబాలాలను బట్టి రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయిస్తారని అన్నారు. బలాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ నలుగురు అభ్యర్ధులను పోటీకి నిలబెట్టాలని, కానీ ముగ్గురు అభ్యర్థులనే పోటీకి నిలబెట్టారని తెలిపారు.

టీఆర్ఎస్ పార్టీకి 17 మంది ఎమ్మెల్యేలు ఉండగా అభ్యర్థిని ఎలా నిలబెట్టిందని, ఇది లోపాయికారి ఒప్పందం కాదా? అని ప్రశ్నించారు. బరిలో నిలబడే అర్హత లేని టీఆర్ఎస్ ఎలా అభ్యర్థిని గెలిపించుకోగలుగుతుందని అన్నారు. 20 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉండి, సమైక్యవాదులమని చెబుతున్న వైఎస్సార్సీపీ ఎందుకు అభ్యర్థిని పోటీకి పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.

లోపాయికారిగా ఒప్పందం చేసుకుని ముందుగానే పోటీ నుంచి వైదొలుగుతున్నామని వైఎస్సార్సీపీ ప్రకటించిందని తెలిపారు. పిల్లి పాలుతాగుతూ ఎవరూ చూడడం లేదనుకున్నట్టు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది, సీఎం అభ్యర్థుల్ని ఉపసంహరింపజేశారు. ఇవన్నీ చేస్తూ ఎవర్ని మోసం చేస్తున్నారని ఆయన నిలదీశారు.

కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతూ ఇష్టానుసారం రాజకీయం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు. ఉల్లంఘనలకు పాల్పడిన అభ్యర్ధులను స్పీకర్ బర్తరఫ్ చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News