: జైరాంతో చర్చలు అర్థవంతగా జరిగాయి: వెంకయ్యనాయుడు
కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తో నిన్న సాయంత్రం అర్థవంతమైన చర్చలు జరిగాయని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. ఏ అంశాలైనా బిల్లులో నిర్దిష్టంగా పొందుపర్చాలని స్పష్టం చేశామని చెప్పారు. పోలవరంను బహుళార్ధసాధక ప్రాజెక్టుగా బిల్లులో పొందుపర్చాలని జైరాంను కోరామన్నారు. అంతేగాక హైదరాబాదులోని సీమాంధ్రుల అపోహలను తొలగించాలని కూడా కోరినట్లు వెంకయ్య చెప్పారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.