: రాష్ట్ర విభజనపై సుప్రీంలో వాడివేడిగా వాదనలు
సుప్రీం కోర్టులో రాష్ట్ర ఏర్పాటుపై వాదనలు వాడివేడిగా సాగుతున్నాయి. సీమాంధ్రుల తరుపున ప్రఖ్యాత న్యాయవాది నారీమన్, శర్మలు వాదిస్తున్నారు. రాష్ట్ర విభజన ఆపాలంటూ కేంద్రాన్ని ఆదేశించాలని నారీమన్ ధర్మాసనానికి తెలిపారు. ఆర్టికల్ 3పై రాజ్యాంగ ధర్మాసనం స్పష్టతనివ్వాలని నారీమన్ కోర్టును కోరారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దాఖలైన 9 పిటిషన్లపై జస్టిల్ ఎల్ దత్తు, జస్టిస్ బాబ్డే ద్విసభ్య ధర్మాసనం ముందు వాదనలు కొనసాగుతున్నాయి.
ఆర్టికల్ 371 డి, ఇ ఉండగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. శాసనసభ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో పెట్టడం సరైన సంప్రదాయం కాదని నారీమన్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేస్తే రాజ్యాంగబద్ధత ఎలా అవుతుందని ధర్మాసనాన్ని వారు ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ సూచించిన విధంగా తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించేలా ఆదేశించాలని నారీమన్ కోరారు. ప్రత్యక రాష్ట్రం ప్రకటించకుండా కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును నారీమన్, శర్మలు కోరారు.