: టీడీపీకే ఓటేసిన ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యే రామకోటయ్య
తెలుగుదేశం పార్టీకి చెందిన నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఆయన ఓటు వేస్తారా? అనే సందేహం అందర్లో నెలకొంది. కానీ, చివరకు ఆయన టీడీపీ అభ్యర్థికే ఓటు వేసి ఉత్కంఠకు ముగింపు పలికారు.