: ఫిబ్రవరి 10, 11న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె


ప్రభుత్వరంగ బ్యాంకులు ఫిబ్రవరి 10, 11 తేదీల్లో మూతపడుతున్నాయి. ఆ రెండు రోజులు ఉద్యోగ సంఘాలు సమ్మె చేయాలని నిర్ణయించుకున్నాయి. ఉద్యోగుల వేతన పెంపుపై బ్యాంకు యూనియన్లకు, యాజమాన్యానికి జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. సమ్మెకు దిగుతున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్ బియు) కన్వీనర్ ఎంవి మురళి చెప్పారు. చీఫ్ లేబర్ కమిషనర్ తో జరిగిన సమావేశంలో బ్యాంకు యూనియన్లు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఏ) మధ్య రాజీ కుదరలేదని ఆయన తెలిపారు. బ్యాంకు యాజమాన్యం ప్రకటించిన వేతన సవరణ పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగా లేదని బ్యాంకు ఉద్యోగుల జాతీయ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ అశ్విని రాణా అన్నారు. అందుకే ఉద్యోగులు సమ్మె బాట పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News