: దీపికా పదుకొనే నాకెంతో స్పెషల్: రణవీర్


తన సహనటి దీపికా పదుకునేకు తన జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉందని నటుడు రణవీర్ సింగ్ తెలిపాడు. అదే సమయంలో సాధారణ స్నేహితుల్లానే ఉంటామన్నాడు. తన జీవితంలో దీపికకు ప్రత్యేక స్థానం ఉందని, ఆమె అంటే గౌరవం, ఆరాధన ఉన్నాయనీ చెప్పాడు. ఆమెకు సన్నిహితంగా మెలిగానని, అద్భుతమైన వ్యక్తి అంటూ కొనియాడాడు. వీరిద్దరి మధ్య డేటింగ్ సాగుతోందని అందరూ అనుకుంటుంటే రణవీర్ ఇలా చెప్పడం దేనికి సంకేతమో? అయితే, రణవీర్ మాత్రం దీనికి తెలివిగా బదులిచ్చాడు. ఒక మంచి స్నేహితురాలిగా ఆమెతో కలిసి బయట సమయం గడుపుతానని చెప్పాడు.

  • Loading...

More Telugu News