: భట్టి ఛాంబర్ లో ఖమ్మం నేతల భేటీ
శాసనసభ ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క ఛాంబర్ లో ఖమ్మం జిల్లా నేతలంతా సమావేశమయ్యారు. వీరంతా భద్రాచలంతో పాటు పోలవరం ముంపుకు గురయ్యే గ్రామాలను సీమాంధ్రలో కలపడంపై చర్చిస్తున్నారు. పోలవరం ముంపు గ్రామాల విషయంలో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో కూడా మంతనాలు సాగించారు. భద్రాచలంతో పాటు పోలవరం ముంపు గ్రామాలు కూడా ఖమ్మం జిల్లాలోనే ఉండాలని వీరు కోరుతున్నారు. జీవోఎం భద్రాచలంతో పాటు పోలవరం ముంపు గ్రామాలు సీమాంధ్రలో కలపాలని నిర్ణయం తీసుకుందన్న ఊహాగానాల నేపధ్యంలో వీరు భేటీ అయ్యారు.